యాలాల, ఫిబ్రవరి 17 : జీతం రా లేదని మనస్తాపంతో సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘట న వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకున్నది. బాధితుడి వివరాల ప్రకారం.. పాత తాండూరుకు చెందిన నర్సింహులు 20 ఏండ్లుగా జిల్లా ప్ర భుత్వ దవాఖానలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల జీతంలో రెండు నెలల జీతం మా త్రమే రావడం, పీఎఫ్ డబ్బులు అడిగితే ఇవ్వకపోవడం, కూతురు వివాహానికి అడ్డంకిగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో సోమవారం ఇంటివద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కు టుంబ సభ్యులు అతను పనిచేస్తున్న దవాఖానకు తరలించారు. ప్రస్తు తం అతని ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జీతం విషయమై గతంలో ఓ సెక్యూరిటీ గార్డ్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.