హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ -తిరుపతి నడుమ ఆదివారం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందస్తుగా నడిపారు. చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు రైలు చేరుకోగా, ఒంగోలు ఉదయం 5.20, చీరాల 6.25 , విజయవాడకు ఉదయం 8.25 గంటలకు చేరుకున్నది. సికింద్రాబాద్-తిరుపతి నడుమ నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ దేశంలో తొమ్మిదవది కానున్నది.