హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): కాకతీ య వర్సిటీ సెర్చ్ క మిటీలో తానుండలేనని, తనను సెర్చ్ క మిటీ నుంచి తప్పించాలని ప్రముఖ వి ద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. రెండ్రోజుల క్రితం ఆయన లేఖ రాశారు.
కేయూ సెర్చ్ కమి టీ సమావేశం శుక్రవారం జరుగనుండగా.. ప్రొఫెసర్ హరగోపాల్ అనాసక్తి వ్యక్తంచేయడంతో ఆయన స్థానంలో జేఎన్టీయూకు చెందిన ప్రొఫెసర్ దామోదరాన్ని సెర్చ్ కమిటీలో సభ్యుడిగా ని యమించారు. ఈ అంశంపై హరగోపా ల్ మాట్లాడుతూ.. తాము వద్దన్న వారి నే వీసీలుగా ఎంపికచేస్తున్న తరుణంలో సెర్చ్ కమిటీల్లో ఉండి లాభమేంటని ప్ర శ్నించారు.
గురువారం ఉస్మానియా, పొట్టి శ్రీరాములు తెలుగు, పాలమూరు వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలను స చివాలయంలో నిర్వహించారు. శుక్రవా రం తెలంగాణ, జేఎన్టీయూ, శాతవాహ న, కాకతీయ వర్సిటీల సెర్చ్ కమిటీ స మావేశాలు జరుగనున్నాయి.