మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, బయ్యారంమే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండంలోని నాలుగు గ్రామాల్లో ఈవీఎం మిషన్లు పనిచేయలేదు. అధికారులు సరిచేయటంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మూసాపేట మండలం రాచాలలో 51వ పోలింగ్ కేంద్రంలో ఉదయం, జానంపేటలో 73వ కేంద్రంలో మధ్యాహ్నం, నవాబ్‌పేట పట్టణంలోని ఉన్నత పాఠశాలలో, మహ్మదాబాద్ మండలం గాధిర్యాల్లో 110వ కేంద్రంలో 49 నిమిషాల పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో క్యూ లైన్లలో ఉన్న ఓటర్లు ఇబ్బందిపడ్డారు. కొద్దిసేపటికి వాటిని సరిచేయగా.. కొన్ని చోట్ల మరో కొత్త ఈవీఎం ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమళ్లలో అరగంటసేపు ఈవీఎం, జోగులాంబ గద్వాల జిల్లా అయిజ 69 పోలింగ్ కేంద్రంలో గంటసేపు వీవీ ప్యాట్ మొరాయించింది.
అధికారులు వేరే మిషన్లు ఏర్పాటు చేసి పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మచ్చ బొల్లారం డివిజన్ వీబీఆర్ గార్డెన్ పోలింగ్ బూత్‌లో, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 275 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో ఇక్కడ పోలింగ్ కాస్త ఆలస్యంగా సాగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని 6 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదు. అధికారులు వాటిని సరిచేయడంతో ఈ కేంద్రాల్లో కాస్త ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. భీమారం మండలం కేంద్రంలో బీఎల్వోలు సరిగా పోల్ చిట్టీ లు పంపిణీ చేయకపోవడంతో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోకుండా తిరిగి వెళ్లిపోవడం కనిపించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 11పోలింగ్ బూత్‌లలో, రాజన్నసిరిసిల్ల జిల్లాలో నాలుగు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కొంతసేపు ఓటింగ్‌కు అంతరాయం కలిగింది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
సిబ్బంది వెంటనే సరిచేసి అందుబాటులోకి తేవడంతో సజావుగా ఓటుహక్కు వినియోగించుకొన్నారు. కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట ప్రైమరీ స్కూల్లోని 160వ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మిషన్ మొరాయించగా, తర్వాత సరిచేసి 8.30 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. నల్లగొండ జిల్లా చి ట్యాల మండలం ఉరుమడ్ల 92వ నెంబర్ కేంద్రం లో ఈవీఎం మోరాయించడంతో పోలింగ్ 45 నిమిషాల ఆలస్యంగా మొదలైంది. ఇక్కడే ఓటు వేయాల్సిన నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి క్యూలైన్లో వేచి ఉండి ఓటు వేశారు. ఇదే మండలం గుండ్రాంపల్లిలోని 62వ బూత్‌లో ఈవీఎంలో సమస్యతో 2 గంటలు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. యాద్రాది భువనగిరి జిల్లా మోత్కూరు మం డలం అనాజిపురంలో 45 నిమిషాలు ఆలస్యమైం ది. చౌటుప్పల్‌లోని లింగోజిగూడెంలో 26వ బూత్ లో గంట ఆలస్యంగా మొదలైంది
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలోని పోలింగ్ బూత్ నంబర్ 26లో సుమారు గంట సేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఓ వ్యక్తి ఓటు వేసేందుకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ గుర్తుపై సిరా చుక్క అంటించాడు. సిరా చుక్క అంటించిన వద్ద ఓటు వేయాలని ఓటర్లకు కొందరు సూచించినట్టు ప్రచారం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న కొందరు బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ ఏజెంట్ల ద్వారా ఎన్నికల నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈవీఎం వారు పరిశీలించి సిరా చుక్క ఉండడాన్ని గుర్తించారు. ఈ విషయంపై ఏజెంట్లు అభ్యంతరం తెలియజేయడంతో గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. అనంతరం మరో ఈవీఎం ఏర్పాటు చేసి ఓటింగ్‌ను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారంలోని 86 పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ అభ్యంతరం తెలపడంతో కొద్దిసేపు ఓటింగ్ నిలిచిపోయింది. ఇక్కడ బ్యాలెట్ యూనిట్‌పై కాంగ్రెస్ హస్తం గుర్తు వద్ద మార్కర్‌తో మార్క్ చేసి బయటకు వచ్చి ఓటర్లకు చెప్పి ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంటు పరిధిలోని అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండ లం పైపాడులోని పోలింగ్ బూత్‌లో ఓ వ్యక్తి ఈ వీఎంపై ఉన్న కారు గుర్తును స్కెచ్ పెన్‌తో చెరిపేశాడు. తర్వాత ఓటింగ్‌కు వెళ్లిన కొందరు కా రు గుర్తు కనిపించకపోవడంతో అధికారులకు ఫి ర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కారు గుర్తు ను చెరిపేశారని బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి కారు గుర్తు మళ్లీ అతికించడంతో సమస్య సద్దుమణిగింది.