SCR | హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి – దర్భంగా స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది. నవంబర్ 19వ తేదీన ఈ ప్రత్యేక రైలు (07999) అందుబాటులో ఉండనుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.