హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్)జోన్ చరిత్రలోనే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆధిక ఆదాయం నమోదైనట్టు జోన్ జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీఆర్కు మొత్తం రూ.21,211.92 కోట్ల స్థూల ఆదాయం సమకూరినట్టు తెలిపారు.
ఇందులో సరుకు రవాణా ద్వారా రూ.13,835.27 కోట్లు, ప్రయాణికుల ద్వారా రూ.6,235.37 కోట్లు, మిగతాది ఇతర మార్గాల ద్వారా సమకూరినట్టు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి 3.12 శాతం వృద్ధి నమోదు చేసినట్టు తెలిపాaరు.