Home
Telangana
Scr Announces Special Trains Between Visakhapatnam Charlapalli On 18 And 19 This Month
Special Trains | శని, ఆదివారాల్లో.. విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన నగర వాసులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్‌కు తిరుగు పయాణయ్యారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి చర్లపల్లికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నది. ఈ రైళ్లు 18, 19 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి.
Special Trains | సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన నగర వాసులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్‌కు తిరుగు పయాణయ్యారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి చర్లపల్లికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నది. ఈ రైళ్లు 18, 19 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి.
విశాఖ-చర్లపల్లి-భువనేశ్వర్ (08549/08550)
- ఈ రైలు 18వ తేదీ రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 19వ తేదీ ఉదయం 7 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి సాయంత్రం 7.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 7.50 గంటలకు బయలుదేరి ఈ నెల 20న తెల్లవారు జామున 2.15 గంటలకు భవనేశ్వర్ చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖ-చర్లపల్లి-విశాఖ (08509/08510)
- ఈ రైలు జనవరి 18న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. 19న ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. అదేరోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లి నుంచి పయణమై రాత్రి 10 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖ-చర్లపల్లి-విశాఖ (08551/08552)
- ఈ రైలు 19న సాయంత్రం 6.20గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 20న ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. మళ్లీ ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి రాత్రి 10 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

