హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : విద్యాసంస్థలు, విద్యార్థులకు ప్రకటించిన దసరా సెలవుల మజా ముగింపు దశకు చేరుకున్నది. సోమవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయి. ఈ కాలేజీలకు ఈ నెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పాఠశాలలు మాత్రం ఈ నెల 15 నుంచి తెరుచుకోనున్నాయి. స్కూళ్లకు 2 నుంచి 14 వరకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. మంగళవారం నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి.