సెలవుల్లో విద్యాలయాల్లో మరమ్మతులు
రానున్న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనే దిశగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు మళ్లీ తెరిచేలోపు పనులను పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు
- బడులు, కాలేజీల్లో పనులకు విద్యాశాఖ టెండర్ల ఆహ్వానం
- పునఃప్రారంభానికల్లా పూర్తి చేసేలా ప్రణాళికల రూపకల్పన
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రానున్న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనే దిశగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు మళ్లీ తెరిచేలోపు పనులను పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు బడులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న బడులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియగా, ఇప్పటికే కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. కాలేజీలు జూన్ 1 నుంచి పున ః ప్రారంభమవుతాయి. ఈ సెలవు రోజుల్లో సర్కారు బడులు, జూనియర్ కాలేజీలు, డిగ్రీకాలేజీల్లో పనులు చేపట్టేందుకు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులు టెండర్లు పిలిచారు.
పనుల్లో ముఖ్యమైనవి
- జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని ఉప్పుగల్‌లో రెండు అదనపు తరగతి గదులు, హనుమకొండ జిల్లా ఒంటిమామిడిపల్లిలో రెండు, ధర్మసాగర్ జెడ్పీహెచ్ఎస్లో రెండు చొప్పున అదనపు తరగతి గదులను నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.
- జూనియర్ కాలేజీ విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో రెండు అదనపు తరగతి గదులు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ కాలేజీ ఆధునీకరణ, కూకట్పల్లి డిగ్రీ కాలేజీలో అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరు మరుగుదొడ్లు నిర్మిస్తారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి, బోయినపల్లి, మరిపల్లి, ముస్తాబాద్, కోనరావుపేటల్లోని కేజీబీవీల్లోఒక్కో దాంట్లో రూ. 1 లక్ష నుంచి 3లక్షల అంచనా వ్యయంతో మరుగుదొడ్లు నిర్మిస్తారు. పలు పాఠశాలలకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇస్తారు.
- 7.93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మెదక్ బాలికల మైనారిటీ గురుకులంలో గ్రంథాలయం, ప్రిన్సిపా ల్, స్టాఫ్ రూం ఇతర మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
- ఒక్కో దాంట్లో 2 లక్షల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో కేజీబీవీ రుద్రంగి, బీసీ వెల్ఫేర్ హాస్టల్ చందుర్తి, బీసీ బాలికల (కళాశాల) హాస్టల్, గంభీరావుపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్ సహా మరికొన్నింటిలో ఆర్వో, వాటర్ ఫ్యూరిఫికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

