చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రసంగానికి పార్టీ నేతలు అంతరాయం కలిగించారు. ‘చరణ్‌జిత్ సింగ్ చన్నీ జిందాబాద్, చన్నీని తిరిగి తీసుకురండి, పంజాబ్‌ను కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు. (Punjab Congress feud) పంజాబ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ భూపేష్ బఘేల్ పర్యటనలో భాగంగా పాటియాలాలో శనివారం పార్టీ సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికలకు సంబంధించి పార్టీ సంస్థాగత వ్యూహం, కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు పార్టీ నేతలు సమావేశమయ్యారు.
కాగా, ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు జరిగాయి. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రసంగిస్తుండగా గందరగోళం చెలరేగింది. ఆయన మాట్లాడటం ప్రారంభించగానే, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మద్దతుదారులు గందరగోళం సృష్టించారు. ‘చరణ్‌జిత్ సింగ్ చన్నీ జిందాబాద్, చన్నీని తిరిగి తీసుకురండి, పంజాబ్‌ను కాపాడండి’ అంటూ పదేపదే నినాదాలు చేశారు. దీంతో వారింగ్ ప్రసంగానికి అంతరాయం కలిగింది. అలాగే పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గ పోరు, విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
CONG V CONG IN PUNJAB!
Punjab Congress in full crisis mode!
As Punjab Congress chief Amrinder Raja Warring addressed workers, supporters raised slogans:
“Bring Channi, Save Punjab”
“Bring Channi, Save Congress.”Rahul Gandhi’s leadership openly challenged from within!… pic.twitter.com/jKQFOmIm74
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) August 1, 2026