School Holidays | టీఎస్ టెట్ (TS TET) హాల్టికెట్లు (Hall Tickets) ఈ నెల 15న జరుగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న పరీక్షా కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న టెట్ పరీక్ష జరుగునుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగనున్నది. అయితే, పరీక్షా కేంద్రాలను పలు పాఠశాలల్లో ఆయా పాఠశాలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ నెల 14న హాఫ్ డే ఇవ్వగా.. పరీక్షా రోజైన 15న సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు ఒకటిన విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.