Schools Reopen | రేపటి నుంచి బడులు పునఃప్రారంభం.. 2026-27 విద్యాసంవత్సరంలో 227 పనిదినాలు
Schools Reopen | వేసవి సెలవుల విరామం తర్వాత సోమవారం బడులు పునఃప్రారంభం కానున్నాయి. సుమారు రెండు నెలలుగా వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి.
Schools Reopen | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల విరామం తర్వాత సోమవారం బడులు పునఃప్రారంభం కానున్నాయి. సుమారు రెండు నెలలుగా వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. స్కూళ్లను శుభ్రంచేసి 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభానికి సిద్ధంచేశారు. వాస్తవానికి పాఠశాలలు జూన్ 12న తిరిగి తెరుచుకోవాల్సి ఉన్నది. ఎండ తీవ్రత నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని జూన్ 15కు వాయిదా వేశారు.
పునఃప్రారంభం వాయిదాతో కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు జూలై 11 (రెండో శనివారం)ను పనిదినంగా పరిగణించాలని నిర్ణయించారు. 2026-27 విద్యాసంవత్సరంలో పాఠశాలలకు 227 పనిదినాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూలై 31 నాటికి మొదటి, సెప్టెంబర్ 21 నాటికి ద్వితీయ, డిసెంబర్ 10 నాటికి తృతీయ నిర్మాణాత్మక మూల్యంకనాలు పూర్తిచేయాలని నిర్దేశించారు.
విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, 2027 జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 23ను చివరి పనిదినంగా నిర్ణయించారు. 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

