హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఇంటర్, సాంకేతిక, కళాశాల విద్యలో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకే చోట ఐదేండ్లు పూర్తైన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా, రెండేండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారు మాత్రమే బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.
మంగళవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభంకానుండగా, 31 వరకు అవకాశమిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇంటర్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖల్లో బదిలీల ప్రక్రియను చేపట్టలేదు. ఇదే అంశంపై ‘ముందుకు సాగని బదిలీలు.. విద్యాశాఖలో ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు’ పేరుతో నమస్తే తెలంగాణ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. దీనిపై సర్కారు సోమవారం స్పందించి మార్గదర్శకాలు విడుదలచేసింది.