హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : పునరుత్పాదక ఇంధన రంగం లో సహకారం కోసం ఎన్టీపీసీ సంస్థతో సిం గరేణి జట్టుకట్టింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో బుధవారం సింగరేణి సంస్థ ఎంవో యూ కుదుర్చుకున్నది. హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రతినిధులు ఆర్ మౌర్య, బిమల్గోపాలాచారి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ మాట్లాడుతూ మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గ ని వద్ద 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాం ట్ను ఏర్పాటు చేయనున్నామని, సోలార్ విద్యుత్తు సామర్థ్యాన్ని 5వేల మోగావాట్లకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. మణుగూరు వద్ద జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంస్థ యోచిస్తున్నదని, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నట్టు చెప్పారు.