తిమ్మాపూర్, జూలై 18: కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య గట్టి ఝలక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అంబేదర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆవిషరిస్తూ ముసుగుల రాజకీయాలకు తెరదించారు. మూడేండ్ల క్రితం తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకుల కోరిక మేరకు అంబేదర్, జగ్జీవన్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వం మారడంతో విగ్రహాలు ఆవిషరణకు నోచుకోక ముసుగులతోనే ఉండిపోయాయి.
ఇటీవల రసమయి బాలకిషన్ విగ్రహాలను ఆవిషరించినప్పటికీ అధికారబలంతో తిరిగి ముసుగులు వేశారు. అధికార పార్టీ నియమించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య శనివారం కరీంనగర్ పర్యటన ముగించుకొని తిరిగి వెళుతూ దళిత సంఘాల నాయకులతో కలిసి విగ్రహాల ముసుగులు తొలగించి క్షీరాభిషేకం చేశారు. విగ్రహాల ఆవిషరణ అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తాను రాజ్యాంగబద్ధమైన వ్యక్తినని నొకి చెప్పారు.
గతంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలకు హాజరై నాయకులకు హామీ ఇచ్చానని, ఆ మేరకు స్థానిక ఎమ్మెల్యేతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విన్నవించినా ఫలితం లేదని చెప్పారు. పర్యటనకు వచ్చిన తాను విగ్రహాలు అలాగే ఉండటం చూసి ఆవిషరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎవరైనా సరే మళ్లీ ముసుగులు వేస్తే జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. దళిత సంఘాలు, ఆవిషరణ కమిటీ జేఏసీ నేతలు హాజరై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీలు, సీఐలు, పోలీసులు పదుల సంఖ్యలో మోహరించారు.