BRSV | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశాలలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. 2025 పీహెచ్డీ ప్రవేశాలలో రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలన్నారు. ఎంసెట్, పీజీ, డిగ్రీ ప్రవేశాలలో ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు అవుతున్నదని గుర్తు చేశారు. వర్గీకరణను నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పెద్దమ్మ రమేష్, జంగయ్య, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, అవినాష్, పవన్, దేవాన్ష్ తదితరులు పాల్గొన్నారు.