స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా దళితుల బతుకులను మార్చడం కోసం ప్రయత్నించలేదు. సీఎం కేసీఆర్ ఇవాళ దళితుల బతుకులను మార్చేందుకు దళిత బంధు పథకం అమలు చేస్తున్నారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ నిధుల కోసం చెప్పులు అరిగేలా తిరిగించుకునేవారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా దళితుల పక్షాన కేసీఆర్కు జైభీమ్లు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. గండ్రపల్లిలో పండుగ వాతావరణం ఉంది. దళితులందరూ ఒకే తాటిపై ఉన్నారు.
– బత్తుల ఎల్లయ్య ( గండ్రపల్లి గ్రామం, జమ్మికుంట మండలం )