హైదరాబాద్, మార్చి27 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో పెట్టిన డీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎస్సీ గురుకుల ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గురుకులంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెల్లించాల్సి డీఏలను దీర్ఘకాలంగా పెండింగ్ పెట్టారని వివరించారు.
డీఏతోపాటు సప్లిమెంటరీ బిల్లులు సైతం కలిపి రూ.67కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. నిధులు విడుదల చేయాలని మంత్రి అడ్లూరికి, సొసైటీ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బకాయిలు విడుదల చేయాలని గురుకుల ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.