హైదరాబాద్, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీకి పార్ట్‌టైం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరోరియం ప్రాతిపదికపై 6233 పోస్టులు మంజూరయ్యాయి. సొసైటీ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలు, సీవోఈ, స్పోర్ట్స్ అకాడమీలు, వొకేషనల్ కాలేజీలు, ప్రత్యేక గురుకులాల్లో కాంట్రాక్ట్‌పై ఇద్దరు, ఔట్‌సోర్సింగ్‌పై 1423 మంది, పార్టటైమర్లుగా 3907 మంది, హానరోరియంపై 901 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారందరి సర్వీస్‌ను కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో 1313ను విడుదల చేసింది. పోస్టుల మంజూరుకు కృషి చేసిన సొసైటీ కార్యదర్శి వర్షిణికి ఉద్యోగుల తరఫున టిగారియా అధ్యక్షుడు నారాయణ, జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్, యూనియన్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ గురుకుల భవనాల్లో అత్యవసర పనుల నిర్వహణకు రాపిడ్ రెస్పాన్స్ బృందాలను నియమించారు. సొసైటీ సెక్రటరీ వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మాషన్, కార్పెంటర్ ఉండనున్నారు. భవనాల్లో విద్యుత్ మరమ్మతులు, కార్పెంట్, ప్లంబింగ్, నిర్మాణాల పనులను ఈ బృందాలే పూర్తిచేస్తాయి.