హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థులపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణిని వెంటనే విధుల నుంచి తొలగించి దళిత అధికారిని నియమించాలని ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకులను దేవాలయాలుగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంటే, దళిత విద్యార్థులపై కార్యదర్శి అనుచితమైన కుల అహంకార వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించారు.
బోర్డు తుడవడం వేరు.. టాయిలెట్స్ కడగడం వేరు అని గుర్తుచేశారు. ఆమె వ్యాఖ్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.