గిర్మాజీపేట, అక్టోబర్ 12 : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్( MLA Vinaybhaskar) వెంటే ఉంటామని నగరంలోని 29వ డివిజన్ ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో దాస్యం వినయ్‌భాస్కర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతిన బూనారు.
గురువారం వారు డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమై రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను గెలిపించుకునేలా కార్యాచరణ గురించి చర్చించుకున్నారు. కార్యక్రమంలో 29వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, తాళ్లపల్లి రమేశ్, గొర్రె కుమార్, మైదం కరుణాకర్, మంద చంటి, గొర్రె అరుణ్‌కుమార్, మిద్దపాక ఆనంద్, ముత్యాల మహేందర్, మాదాసు ఎలీషా, తెలకలపల్లి సారంగం, ఆనగల సమ్మయ్య, రేండ్ల జంపయ్య, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.