గిర్మాజీపేట, అక్టోబర్ 12: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ వెంటే ఉంటామని నగరంలోని 29వ డివిజన్ ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ.. ఎన్నికల్లో దాస్యం వినయ్‌భాస్కర్‌ను మరోమారు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు. గురువారం వారు డివిజన్లోని ఓ ఫంక్షన్ హాలులో సమావేశమై దాస్యం వినయ్‌భాస్కర్‌ను గెలిపించుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.