హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరిని బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టు బార్ అసోసియేషన్ మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. జస్టిస్ పీ శ్రీసుధను కర్ణాటకకు, జస్టిస్ కే సురేందర్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎంపిక చేసి బదిలీ చేయాలని నిర్ణయించడం సబబుకాదని, పారదర్శకత పాటించాలని బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసింది.