హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో ఇటీవల అమల్లోకి తెచ్చిన ఎస్సీ వర్గీకరణను కచ్చితంగా అమలుచేయాలని అత్యంత వెనకబడిన 57 ఎస్సీ కులాల హకుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఏ, బీ, సీ గ్రూపుల వారీగా సీట్లను కేటాయించాలని సమితి జాతీయ అధ్యక్షుడు బైరీ వెంకటేశం శనివారం ప్రకటనలో కోరారు. షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న 15% రిజర్వేషన్లను జనాభా ఆధారంగా ప్రభుత్వం ఏ,బీ,సీ గ్రూప్లుగా వర్గీకరించిందని గుర్తుచేశారు.