హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల్లో ఎస్సీ వర్గీకరణను కచ్చితంగా అమలుచేయాలని అత్యంత వెనుకబడిన ఎస్సీ 57 కులాల హకుల పోరాట సమితి డిమాండ్ చే సింది. ఏ, బీ, సీ గ్రూపులవారీగా సీట్లు కేటాయించాలని కోరింది. సమితి జాతీ య అధ్యక్షుడు బైరి వెంకటేశం శనివా రం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ని షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగబద్ధం గా అమలవుతున్న 15% రిజర్వేషన్లను జనాభా ఆధారంగా ప్రభుత్వం 3 గ్రూ పులుగా వర్గీకరించిందని గుర్తుచేశారు. సవరించిన రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ నియామకాలు, స్థానిక సంస్థల్లో అమలుచేయాల్సి ఉందని తెలిపారు.
ఓపెన్ యాక్సిస్పై 35 పైసల సర్‌చార్జీ!
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో కరెంట్ కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నుంచి యూనిట్‌కు 35 పైసల సర్‌చార్జీ వసూలు చేస్తామంటూ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం)లు ప్రతిపాదించాయి. ఈ అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు సర్‌చార్జీ వసూలుకు అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని డిస్కంలు వెల్లడించాయి.