హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మాదిగలు, మాదిగ ఉపకులాల పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే ఎస్సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పం పించారని గుర్తుచేశారు. ఏ లెక్కన మాదిగలకు 9% రిజర్వేషన్లు ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎస్సీల జనాభాను సమగ్రంగా సేకరించి అందుకనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.