హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూ తనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సం క్షేమ సంఘం హర్షం ప్రకటించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు వీ సైదా, గౌరవ అధ్యక్షుడు శంకర్ నేతృత్వంలో సం ఘం నేతలు శనివారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.