హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం కొనసాగుతున్నదని, త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నియామకాలను చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ జరపడంతో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.
ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల ని యామక ప్రక్రియను 6 వారాల్లోగా పూర్తిచేసి, నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.