హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి సహాయం వెల్లువెత్తుతున్నది. గురువారం పలువురు దాతలు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చెక్కులను అందజేశారు.
ఎస్బీఐ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం రూ.5 కోట్లను విరాళంగా ప్రకటించారు. అరబిందో ఫార్మా రూ.5 కోట్లు అందజేసింది. విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ. 15 కోట్లు విరాళంగా అందజేశారు. ఎంపీ బండి పార్థసారథి రెడ్డి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు.