
హైదరాబాద్ : ప్రకృతిని కాపాడండి.. భూత దయ చూపండి.. అది మనల్ని కాపాడుతుందని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. కరోనా నేపథ్యంలో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు, ఆక్సిజన్ కోసం పడుతున్న తిప్పలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. మానవుడు తన మనుగడ కోసం, అభివృద్ధి పేరుతో ఏ విధంగా తోటి ప్రాణులను హరిస్తూ, ప్రకృతిని నాశనం చేసుకుంటూ వచ్చాడో వీడియోలో విషదీకరించారు.
వీడియోను పోస్టు చేస్తూ ఎంపీ ఈ విధంగా స్పందించారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ప్రకృతి పట్ల, సహ జీవుల పట్ల దయ చూపండి. అది ఎన్నటికి మనకు చెడు చేయదు. పాత వీడియో అయినప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతిని కాపాడండి అది మనల్ని కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.
It’s known thing to all of us there will be an equal reaction to every action. Sooner or Later. Be kind to Nature and co-existing creatures. It can never be harmful for us, the mankind.
— Santosh Kumar J (@MPsantoshtrs) May 11, 2021
Old imaginary video but worth remembering for life👇.#SaveTheNature ‘N’ #NatureWillSaveYou pic.twitter.com/471MbPQO7q