వేల్పూర్, ఆగస్టు 4: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో కరెంట్ సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని రైతులు సోమవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఎస్ఈకి ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
నీరందక మక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు.