మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బగూడంకు చెందిన ధారావత్ బానోతు లాల్య, వీరన్న యూరియా టోకెన్ల కోసం బొద్దిగొండకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో గూడూరు నుంచి మహబూబాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై జగన్ నాయకుల గూడెం స్టేజి వద్ద బొలేరో వాహనం ఢీ కొట్టడంతో లాల్య అక్కడికక్కడే మృతి చెందగా వెంకన్నకు తీవ్ర గాయాలు అయ్యాయి.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.