బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ దుశ్శాసన పర్వాన్ని తలపించేలా వ్యవహరించింది. ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి పట్ల కిరాతకంగా వ్యవహరించారు. మహిళలు అనే విచక్షణ లేకుండా పోలీసులు చీర లాగి, మెడపై చేయి వేసి అవమానించారు.
కాంగ్రెస్ అరాచక పాలనలో మహిళా ప్రజా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయింది. మహిళలను అవమానించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదు. దుశ్శాసన పర్వాన్ని తలపించేవిధంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీకి నాడు కౌరవులకు పట్టిన గతే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తున్నది.
-సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి