హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై అబద్ధాలతో మోదీ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆరోపించారు. ‘శనివారం శాపనార్థాలు’ సీరియల్లా మోదీ మాటతీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలన, అవినీతి అని మోదీ పేర్కొనటం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.