KTR | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మించిన కాంగ్రెస్ నేతల ఫాంహౌజ్‌లు కూలగొట్టే దమ్ము హైడ్రాకు ఉన్నదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాషీ వంటి కాంగ్రెస్ నేతలు చెరువుల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో లేదా బఫర్ జోన్లలో నిర్మించుకున్న రాజభవనాలను కూల్చగలదా? అని నిలదీశారు. సీఎం ఫాంహౌజ్ శాటిలైట్ మ్యాప్‌లను కూడా మీడియాకు పంపిస్తానని చెప్పారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రు లు, ఎమ్మెల్యేల రాజభవనాలు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. ‘ఎఫ్టీఎల్ పరిధిలో కట్టుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాషీ.. వీళ్లందరి ఫాంహౌజ్‌ల దగ్గరికి వెళ్లి కూలగొడదాం. వీరితోపాటు రేవంత్‌రెడ్డికి కూడా ఫాంహౌజ్ ఉన్నది.
సీఎం ఫాంహౌజ్ శాటిలైట్ మ్యాప్‌లను కూడా మీడియాకు పంపిస్తా చూసుకోండి. నా పేరు మీద ఫాంహౌజ్ ఉన్నట్టు మీడియాలో ఏవేవో కథనాలు రాస్తున్నారు. కానీ, స్పష్టంగా చెప్తున్న.. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు. జన్వాడలో నా స్నేహితుడి ఫాంహౌజ్‌ను లీసుకుతీసుకున్న. ఎఫ్టీఎల్ లేదా బఫర్‌జోన్‌లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా. నో ప్రాబ్లం. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్న. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్ నేతలు కట్టిన రాజభవనాల సంగతేంది? నా స్నేహితుడి ఫాంహౌజ్‌ను జూమ్ పెట్టి తీస్తున్నారు. అవి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఒకవేళ తప్పు జరిగితే దగ్గరుండి కూల్చివేయించేందుకు సహకరిస్తా.
ఇక హైడ్రానో.. అమీబానో ఉంది కదా. దాన్ని తీసుకొని అకడి నుంచి నేరుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌజ్ నుంచి మొదలుపెడుదాం. వాళ్ల తమ్ముడు కూడా అకడే ఉన్నాడు. ఎమ్మె ల్యే వివేక్ వెంకటస్వామి ఫాంహౌజ్ కూడా నీళ్లలోనే కట్టారు. అన్నీ ఒకటే రోజు కూలగొడుదాం. ప్రజలకు పారదర్శకంగా ఉందాం. తప్పు నేనుచేసినా సరే చర్యలు తీసుకోండి. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరం లేదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. సమావేశంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, పీ విష్ణువర్దన్‌రెడ్డి, షేక్ అబ్దుల్లా సోహైల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.