కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 8 : తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును వెనక్కి తీసుకుంటున్నానని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఒక పరిశోధకురాలిగా యుద్ధం అంటే భయంతో, అందులో మరణించే పసిపిల్లలు గుర్తుకు వచ్చి పోస్ట్ చేశాను తప్ప.. దేశ భద్రత, సైన్యం, ప్రభుత్యంపై అగౌరవంతో కాదని స్పష్టంచేశారు. తన వ్యా ఖ్యలు ఎవరినీ కించపరిచేవి కావని, ఎవరైనా బాధపడినా, మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరారు.