ఫర్టిలైజర్‌సిటీ, జనవరి 31: గోదావరిఖని పీజీ కళాశాల భౌతికశాస్త్ర అధ్యాపకుడు, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ రమాకాంత్ చేసిన పరిశోధనకు పేటెంట్ హక్కులు వచ్చాయి.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఏసీ జేమ్స్ రాజు పర్యవేక్షణలో డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు సహకారంతో ట్యూనబుల్ మైక్రోవేవ్ పరికరాల కోసం 300 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో ఎలక్ట్రిక్ థీన్ ఫిల్మ్‌ను స్పటికీకరించడానికి లేజర్ ఆధారిత పద్ధతిపై చేసిన పరిశోధనకు పేటెంట్ వచ్చినట్టు రమాకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా రమాకాంత్‌ను పలువురు అధ్యాపకులు అభినందించారు