సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 19 : విద్యార్థిపై జావ పడి గాయపడిన ఘటనలో సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను యాదాద్రి కలెక్టర్ గురువా రం సస్పెండ్ చేశారు. బుధవారం ఎనిమిదో తరగతి విద్యార్థి శివరాత్రి సామెల్తోపాటు మరికొందరితో రాగి జావ సర్వ్ చేయించారు.
గిన్నె జారి కాళ్లపై పడటంతో సామెల్ తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లును కలెక్టర్ హనుమంతురావు సస్పెండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యా ర్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సామెల్‌ను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు.