హిమాయత్‌నగర్/ కరీంనగర్ కార్పొరేషన్, ఖమ్మం/రఘునాథపాలెం, డిసెంబర్ 2: హైదరా బాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న వి గ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న గౌడ హాస్టల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వా యి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఎంతగానో కృషిచేశారని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న జయం తి, వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. గౌడ కులస్థులకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఖమ్మం శివారు రఘునాథపాలెం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభు త్వం 29 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఆ స్థలాన్ని తహశీల్దార్ నర్సింహారావుతో కలిసి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ స్థలంలో గౌడ సంఘం నేతలతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి బాలసాని క్షీరాభిషేకం చేశారు.