హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతిని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్నారు. 17వ శతాబ్దంలోనే సొంత సైన్యంతో గోల్కొండ రాజులపై తిరుగుబాటు చేయడంతోపాటు, ఖిలాషాపూర్ కేంద్రంగా చేసుకుని రాజ్యపాలన సాగించారు.
ఈ మేరకు ఆయన 375వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమశాఖ నేతృత్వంలో రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. అదేవిధంగా ట్యాంక్‌బండ్ సమీపంలో పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం విగ్రహ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పరిశీలించారు.