హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టనున్నట్టు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పం చు ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా జీ సర్పంచులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): బదిలీలు పొందిన ఉపాధ్యాయులందరూ ఈనెల 2న ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి సభకు కచ్చితంగా హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంఎస్ అండ్ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వాళ్లు హాజరు కావాలని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): ఈ నెల 6న రవీంద్రభారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతి నిర్వహిస్తున్నట్టు గద్దర్ ఫౌండేషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.