హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ): పెండింగ్ బిల్లులు చెల్లించేలా అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎర్రవెల్లిలోని నివాసంలో జేఏసీ నాయకులు కేసీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించాలని కోరారు. సమావేశంలో గణేశ్, ప్రభాకర్, పద్మాకర్రెడ్డి, బీరప్ప, అశోక్నాయక్ పాల్గొన్నారు.