నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బీజేపీకి చుక్కెదురైంది. టీఆర్ఎస్ను కాదని బీజేపీలో చేరిన నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు.
ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీల నుంచి నుంచి గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన దోనిపాముల పరిణామం బీజేపీకి మింగుడు పడకుండా చేసింది.
ఈ మేరకు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో.. తాను తిరిగి మాతృసంస్థ టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సర్పంచ్ దేవేందర్ ప్రకటించారు.
కాగా, పార్టీలో చేరిన దేవేందర్‌కు మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీటీసీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.