హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో అభ్యర్థి భర్త కిడ్నాప్ ఘటనపై బీసీ వర్గాలు భగ్గమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నా యి. ప్రజాపాలనలో ఇలాంటి దాడులేమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలకు బీసీ, వివిధ కులసంఘాల నాయకులు, బీసీ మేధావులు పట్టబడుతున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో సర్పంచ్ స్థానానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మామిడి యాదగిరి యాదవ్ భార్య నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులు యాదగిరి యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన విషయం బయటకొచ్చింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, మేధావులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
రాష్ట్రంలో ఆధిపత్య కులాలు ఆడుతున్న వికృత రాజకీయ క్రీడలకు ఇదే నిదర్శనమని నిప్పులు చెరుగుతున్నాయి. ప్రజాపాలన పేరుతో కాం గ్రెస్ పార్టీ బీసీలను ఎంతగా అవమానపరుస్తున్నదో, ఎంతలా అణచివేస్తున్నదో ఈ ఒక ఘటనే నిదర్శనమని మండిపడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగడాలకు అంతులేకుండా పోయిందని ధ్వజమెత్తుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు కైలా శ్ నేతకు నల్లగొండ డీసీసీ పదవి దకినా ఓర్వలేక అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అగ్రకులాల దురాహంకారానికి ఈ ఘటనలే సాక్ష్యమని మండిపడుతున్నారు. ఈ అమానుష ఘటనలపై ప్ర భుత్వం తక్షణమే స్పందించాలని, కోమటిరెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, లేదంటే గుణపాఠం తప్పదని బీసీ సంఘాలు, కులసంఘా లు, ప్రజా సంఘాలు, పౌరహకుల సంఘా లు, విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
నల్లగొండ ఘటనపై క్షమాపణ చెప్పడంతోపాటు, కోమటిరెడ్డిని బర్తరఫ్ చేయాలని, లేదంటే 7న ముఖ్యమంత్రి ఓయూ పర్యటనను అడ్డుకుంటామని బీసీ విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎల్లమ్మగూడేనికి చెందిన లక్ష్మీయాదవ్, యాదగిరియాదవ్ కుటుంబానికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని, హత్యాయత్నానికి పాల్పడిన వారిపై రౌడీషీటర్ కేసు, పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ జనసభ, యాదవ సంఘాల ఆధ్వర్యంలో 5న చలో ఎల్లమ్మగూడెం, 10న చలో గన్ పార్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.