హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు బుధవారం ఆమెకు సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బిల్లుల కోసం ఇప్పటికే గవర్నర్, సీఎంతోపాటు మంత్రులకు వినతిపత్రాలు అందజేశామని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి సర్కారు పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా, తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు ఇప్పించాలని విన్నవించారు.
కార్మికశాఖలో పదోన్నతులు
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కార్మికశాఖలో ఇద్దరు స హాయ కమిషనర్లకు ఉప కమిషనర్లుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. జీ బాల నర్సింహ స్వామిని నల్లగొండ, కోలా ప్రసాద్‌ను కరీంనగర్ డీసీఎల్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాల నర్సింహస్వామి, కోలా ప్రసాద్‌తోపాటు సహాయ కమిషనర్లు ఎం కోటేశ్వర్లు, పీ ప్రభావతిని ఉప కమిషనర్లుగా ఉద్యోగోన్నతికి డిపార్ట్మెంటల్ కమిటీ సిఫారసు చేయగా, వాటిని ఆమోది స్తూ కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీచేశారు. ఉప కమిషనర్ పీ జగదీశ్‌కుమార్‌ను డిప్యూటేషన్‌పై జీహెచ్ఎంసీలో పర్సనల్ ఆఫీసర్‌గా నియమించారు.