హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడు జయంతిని ఇంగ్లిష్ భాషా దినోత్సవంగా జరుపాలని విద్యాశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 13న సరోజినీనాయుడు జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, స్టోరీ రైటింగ్ పోటీలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్ ఆదేశాలిచ్చారు.