హాజీపూర్, డిసెంబర్ 9: ఈ నెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మం డల కేంద్రంలో పట్టుకున్నట్టు ఫ్లయింగ్ స్కాడ్ బృందం తెలిపింది. మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో మంగళవారం రాత్రి ఫ్లయింగ్ స్కాడ్ బృందం వాహనాల తనిఖీ చేపట్టింది. ఓ కారు ఆపకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకొని తనిఖీ చేశారు. కారులో రూ.1.09 లక్షల విలువైన చీరలు లభించాయి. చీరలతోపాటు కారును సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టాటికల్ సర్వే బృందానికి అప్పగిస్తామని హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. ఈ చీరలు బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థివని సమాచారం. గఢ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి చీరలను పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.