Saraswati Pushkaralu | కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ పుష్కరాలను ప్రారంభించారు. అంతకు ముందు కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో త్రివేణి సంగమం వద్దకు చేరుకొని గణపతి పూజతో క్రతువును ప్రారంభించారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీమాతకు చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేశారు. త్రివేణి సంగమం వద్ద మంత్రి శ్రీధర్‌బాబు పుష్కర స్నాననం చేసి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలు ఈ నెల 26 వరకు కొనసాగనుండగా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా సరస్వతీ పుష్కరాలు నిర్వహిస్తున్నారు. పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా.