హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): జగిత్యాల కేసీఆర్ సభ పోస్టర్‌ను మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డితో కలిసి శనివారం లండన్‌లో ఆవిష్కరించారు. కేసీఆర్ సందేశం కోసం తెలంగాణ ప్రజలు, ఎన్నారైలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.
సభకు లక్షలాది మంది తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరుతున్న తాటిపర్తి జీవన్‌రెడ్డికి ఎన్నారైల పక్షాన నవీన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి, సీనియర్ నేత రాఘవ, ఉపాధ్యక్షులు రవి రేతినేని, సత్యమూర్తి చిలుముల, రమేశ్ ఎసెంపల్లి, గణేశ్ కుప్పాల తదితరులు పాల్గొన్నారు.