హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అంతరిస్తున్న జీవవైవిధ్యంతో యావత్ ప్రపంచం అల్లాడిపోతున్న వేళ.. పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ వేదికగా మొదలైన ఓ మహా ఉద్యమం ఇప్పుడు లండన్ గడ్డపై ప్రతిధ్వనించబోతున్నది. మార్పు అనేది కేవలం ప్రభుత్వాల వల్లే కాదు, ప్రజలతోనే సాధ్యమనే బలమైన సందేశాన్ని ప్రపంచవేదికలపై వినిపించేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ సిద్ధమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద సిటిజన్-లెడ్ (ప్రజల భాగస్వామ్యంతో నడిచే) పర్యావరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఆయనకు ‘లండన్ ైక్లెమేట్ యాక్షన్ వీక్ 2026’లో పాల్గొనాల్సిందిగా బ్రిటన్ పార్లమెంట్ నుంచి మరోసారి ఆహ్వానం అందింది.
ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్ సదస్సుకు కో-హోస్ట్‌గా..
పర్యావరణాన్ని కాపాడటంలో సామాన్య పౌరులు కూడా సైనికుల్లా ఎలా భాగస్వాములు కావచ్చో సంతోష్‌కుమార్ ఆచరణలో నిరూపించారు. ఇదే అంశాన్ని ప్రపంచ నేతలకు వివరించేందుకు ఈ నెల 23న బ్రిటన్ పెద్దల సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ‘ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్’ అంశంపై పార్లమెంటరీ సదస్సు జరుగనున్నది. లండన్‌కు చెందిన రాంఫాల్ ఇన్స్టిట్యూట్, ఇగ్నైటింగ్మైండ్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సంతోష్‌కుమార్ కో-హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు, దౌత్యవేత్తలు, ైక్లెమేట్ లీడర్లు పాల్గొని.. కేవలం హామీలకే పరిమితం కాకుండా, ప్రభుత్వాలు యాక్షన్ ప్లాన్‌లోకి ఎలా దిగాలనే అంశాలపై లోతుగా చర్చించనున్నారు.
సంతోష్‌కుమార్‌కు ప్రత్యేక సతారం
ఈ నెల 24న లండన్‌లో రెడ్ బ్రిడ్జ్ మేయర్ ఆధ్వర్యంలో జరిగే ైక్లెమేట్ అండ్ సస్టెయినబిలిటీ లీడర్షిప్ ఫోరమ్‌లో సంతోష్‌కుమార్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన అసమాన కృషిని గుర్తిస్తూ లండన్ మేయర్ ఆఫీస్ సంతోష్‌ను ప్రత్యేకంగా సతరించనున్నది. లండన్ పర్యటనలో సంతోష్ వెంట ఇగ్నైటింగ్మైండ్స్ ఫౌండర్ ఎం కరుణాకర్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ సంజీవరాళ్ల రాఘవేందర్ కూడా పాల్గొంటున్నారు.
డిసెంబర్ లో ‘హైదరాబాద్ ైక్లెమేట్ యాక్షన్ వీక్
లండన్ పర్యటన ముగిసిన తర్వాత, ఇగ్నైటింగ్మైండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వచ్చే డిసెంబర్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ‘హైదరాబాద్ ైక్లెమేట్ యాక్షన్ వీక్ (హెచ్సీఏడబ్ల్యూ) 2026’ అత్యంత భారీ జరుగనున్నది. దక్షిణాది దేశాలకు ఇదొక అతిపెద్ద వేదికగా నిలవబోతున్నది. వాతావరణ మార్పులపై పోరాటం కేవలం ప్రభుత్వాలు చేస్తే సరిపోదు, కోట్లాది మంది ప్రజలు ఏకమైతేనే అది సాధ్యం అని గ్రీన్ ఇండియా చాలెంజ్ నిరూపిస్తున్నది. కమ్యూనిటీ-లెడ్ యాక్షన్ ద్వారా పర్యావరణ రక్షణలో భారతదేశం నేడు ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్నది.
వసుధైక కుటుంబం స్ఫూర్తి..
యూకే పార్లమెంట్ ఆహ్వానంపై సంతోష్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ‘ఈ అంతర్జాతీయ గుర్తింపు నా ఒకడిది కాదు. భూమి తల్లి రక్షణ కోసం మొకలు నాటిన ప్రతి వలంటీర్, ప్రతి పౌరుడు, ప్రతి చిన్నారికీ దకుతుంది. ప్రజలకు బాధ్యత అప్పగిస్తే, పర్యావరణంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో భారతదేశం ప్రపంచానికి చేసి చూపించింది. వసుధైకం (ప్రపంచమే ఒక కుటుంబం) స్ఫూర్తిని హైదరాబాద్ నుంచి లండన్ వెస్ట్ మిన్స్టర్ వరకు తీసుకెళ్లడం నాకు దకిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని సంతోష్‌కుమార్ పేరొన్నారు.